వద్దిరాజు రవిచంద్ర రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనందుకు సంబరాలు

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కు , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, కృతజ్ఞతలు తెలిపిన మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా: మున్నూరు కాపు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన శుభసందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నంది కిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో టపాసులు పేల్చి , స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు నంది కిషన్ మాట్లాడుతూ మున్నూరు కాపు సంగం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర రెండోసారి రాజ్యసభకు ఎన్నికైనందుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

రెండోసారి రాజ్యసభకు అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( kcr )కి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.వద్దిరాజు రవిచంద్ర మున్నూరు కాపుల అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Congratulations To Vaviraju Ravichandra For Being Elected As A Member Of The Raj

ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, ఎంపిటీసీ సభ్యులు ఉప్పుల మల్లేశం, మున్నూరు కాపు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మీసం రాజం, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు బండారి బాల్ రెడ్డి , వడ్నాల భాస్కర్, చకినాల వెంకటయ్య, మేడిశెట్టి శ్రీనివాస్, కర్లశేఖర్, పంతం రాంచందర్ , కిష్టయ్య , జంగిడి సత్తయ్య , ఆనందం , తడకల దేవరాజు , మండల కోశాదికారి పాత తులసి , ప్రదాన కార్యదర్శి వడ్నాల భాస్కర్ , ఎల్లారెడ్డిపేట పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బాధ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!
Advertisement

Latest Rajanna Sircilla News