బెట్టింగ్ నిర్వహించడం నేరం:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:బెట్టింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన వ్యసనమని,ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ లాంటి వాటిపై పోలీస్ శాఖ నిఘా ఉంచిందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ( SP Rahul Hegde)ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

బెట్టింగ్ అనేది ఒక విష సంస్కృతి అని,దీనివల్ల జీవితాలు ఆర్థికంగా నష్టపోయి,కుటుంబాలు నాశనం అవుతున్నాయని, బెట్టింగ్ సంస్కృతికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని,ముఖ్యంగా యువత బెట్టింగ్ మాఫియా మాయలో పడవద్దని కోరారు.బెట్టింగ్ యాప్స్,ఆన్లైన్ బెట్టింగ్స్, ప్రత్యక్ష బెట్టింగ్ లపై నిఘా ఉంచామన్నారు.పౌరులను,యువతను, విద్యార్థులను ఎవరైనా బెట్టింగులకు ప్రోత్సహించినా, బెట్టింగులు పెట్టడానికి ప్రలోభాలకు గురిచేసినా అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల,యువత యొక్క నడవడికపై,ఆర్థిక పరమైన అవసరాలపై గమనిస్తూ ఉండాలని కోరారు.బెట్టింగ్ లకు పాల్పడేవారి,బెట్టింగ్ నిర్వాహకులు, మధ్యవర్తులు ఎవరైనా ఉంటే ఎలాంటి వారి సమాచారం స్థానిక పోలీసు అధికారులకు, డయల్ 100 కు, సూర్యాపేట జిల్లా ( Suryapet District)పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712686026 కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Conducting Betting Is A Crime: District SP Rahul Hegde ,betting, Ipl Betting ,
ఎన్నికల కోడ్ ముగిసినా విగ్రహాలకు తొలగని ముసుగులు...!

Latest Suryapet News