Sara Ali Khan : నిరుపేదల ఆకలి తీరుస్తున్న సారా అలీఖాన్.. ఈమె మంచి మనస్సుకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

సైఫ్ అలీ ఖాన్,అమృత సింగ్( Saif Ali Khan ) ల కుమార్తె సారా అలీ ఖాన్( Sara Ali Khan) గురించి మనందరికీ తెలిసిందే.తల్లిదండ్రుల నటనను వారసత్వంగా తీసుకుని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్.

 Bollywood Actress Sara Ali Khan Visited Temple Helps Poor People Video Viral-TeluguStop.com

నటన లోనే కాకుండా మంచి మనసున్న అమ్మాయిగా కూడా అందరి మన్ననలు పొందుతోంది.అవును సారా అంటే అందరికీ ఇష్టమే.

తక్కువ సమయంలోనే తన కెరీర్‌లో చాలా పేరు సంపాదించుకుంది ఈ నటి.సినిమాల ద్వారా తన అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు వ్యక్తిగతంగా ప్రజలతో కలిసిపోవడానికి కూడా ఇష్టపడుతుంది.

ముస్లిం కుటుంబంలో జన్మించిన సారా అలీ ఖాన్ హిందూ దేవాలయాలను సందర్శించడానికి వెళ్తుంది.ఇలా చేస్తూ అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటుంది.అయినా సారా తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటుంది.ఇప్పుడు సారా కు సంబంధించిన మరొక వీడియో బయటపడింది.దీనిలో ఆమె పేదవారికి సహాయం చేస్తుంది.సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్న వీడియోలో సారా అలీ ఖాన్ ఒక సాధారణ అమ్మాయిలా రోడ్డు పక్కన నిలబడి పేద ప్రజలకు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు చూడవచ్చు.

ఒకొక్కరిని పలకరిస్తూ అందరి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటూ, కలుస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తోంది.

ఈ సమయంలో, నిరుపేదలు కూడా సారాకు ఆశీస్సులు అందజేయడం కనిపిస్తుంది.వీడియో చివర్లో సారా అలీ ఖాన్ పబ్లిక్ కంట పడకుండా దాక్కొని చాలా సింపుల్ గా కారులో కూర్చుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది.అయితే సారా అలీఖాన్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు.

ఇంతకుముందు కూడా సారా మంచి మనసుకు సంబంధించిన ఇలాంటి వీడియోలు కనిపిస్తాయి.అందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube