బస్సు" కాదిది...అందమైన గూడెం "బడి"

మంత్రి కే టి ఆర్ చొరవతో తీర్చిదిద్దిన గూడెం ప్రభుత్వ బడిబస్సుల బడి.పల్లెవెలుగు, సిటీబస్సుల్లా తరగతి గదులు.

అందమైన రంగులతో ఆకర్షిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీ గూడెం పాఠశాలరాజన్న సిరిసిల్ల జిల్లా :ఈ ఫొటోలు చూశారా.? అచ్చం విద్యార్థులు బస్సెక్కి స్కూలుకు పోతున్నట్లు, దిగి వస్తున్నట్లు ఉంది కదా.ఇది బస్టాప్‌ అనుకుంటున్నారా.? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే.బస్సు" కాదిది.

Classrooms In Buses At Rajanna Sircilla District ,Give Foundation, Rajanna Sirc

అందమైన గూడెం "బడి"లో అందంగా తీర్చిదిద్దిన తరగతి గదులు.విద్యార్థులను ఆకర్షించేలా మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ క్రమంలో ముస్తాబాద్‌ మండలం గూడెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఇలా ఆకర్షణీయంగా మార్చారు.గివ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్‌ నిధులతో మూడు బస్సుల బడిగా మార్చారు.

Advertisement

గంభీరావుపేట మండలం నర్మాలకు చెందని చిత్రకారుడు నారోజు చంద్రశేఖర్‌ మూడు తరగతి గదులను అందమైన రంగురంగుల పెయింటింగ్స్‌తో మెట్రో, పల్లెవెలుగు, సిటీ బస్సుల్లా తీర్చిదిద్దారు.తమ తరగతి గదులు ఆకర్షణీయంగా ఉండడంతో విద్యార్థులు నిత్యం పాఠశాలకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారు.

యూకే బాస్ దారుణం.. గర్భిణీ అని కూడా చూడకుండా ఉద్యోగం నుంచి పీకేశాడు.. కానీ చివరకు?
Advertisement

Latest Rajanna Sircilla News