అస్తవ్యస్తంగా చెర్కుపల్లి- మాడ్గులపల్లి సింగిల్ రోడ్డు

నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండల పరిధిలో హైదరాబాద్-విజయవాడ( Hyderabad-Vijayawada ) జాతీయ రహదారిపై ఇనుపాముల బస్ స్టేజ్ నుండి మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని మాడుగులపల్లి మండల కేంద్రం వరకు గల 35కి.

మీ.

సింగల్ రోడ్డును మూడేళ్ళ క్రితం ఇనుపాముల బస్ స్టేజ్ నుండి చెర్కుపల్లి - తుంగతుర్తి వరకు 16 కి.మీ.డబుల్ రోడ్డుగా మార్చారు.చెర్కుపల్లి- మాడ్గులపల్లి మండల కేంద్రం వరకు గల 20 కి.మీ.సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా చేస్తే హైదరాబాద్-విజయవాడ, నార్కెట్ పల్లి-అద్దంకి జాతీయ రహదారుల మధ్య ప్రయాణించే వారికి ఇబ్బందులు తొలగిపోయి సురక్షిత ప్రయాణం సులువుతుంది.ప్రస్తుతం చెర్కుపల్లి-మాడ్గులపల్లి వరకు గల సింగిల్ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి అస్తవ్యస్తంగా తయారైంది.

ఈ రోడ్డుపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ,నల్లగొండ, సూర్యాపేట,నకిరేకల్ నియోజకవర్గాల నుండి నిత్యం వేలాది మంది ప్రయాణికులు,వందలాది వాహనాల్లో ప్రయాణిస్తారు.ఇంత పెద్ద మొత్తంలో రాకపోకలు జరిగే రోడ్డు శిధిలావస్థకు చేరి, ప్రమాదాలకు నెలవుగా మారి,ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నా పాలకులు పట్టింపులేక పోవడం,కనీస మరమ్మతులు చేపట్టాల్సిన ఆర్ అండ్ బీ అధికారులు అడ్రస్ లేకుండా పోవడంపై ప్రయాణికులు,వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వర్షా కాలంలో గుంతల్లో నీళ్ళు నిలిచి రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి చెర్కుపల్లి-మాడుగులపల్లి మండల కేంద్రం వరకు సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా నిర్మించాలని చెరుకుపల్లి సర్పంచ్ చిన్నబోస్క ప్రసాద్,పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Advertisement
ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Latest Suryapet News