టిడిపి అధినేత చంద్రబాబు( N Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టై అయ్యారు.ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఈరోజు ఉదయం తరలించారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బంద్ కు పిలుపునిచ్చింది.ఈ బంద్ కు జనసేన పార్టీ కూడా మద్దతు తెలిపింది.
ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఉండగా, లండన్ పర్యటన పూర్తి చేసుకుని ఏపీ సీఎం జగన్ ఈరోజు రాత్రికి అమరావతి చేరుకోబోతున్నారు.ఈనెల రెండో తేదీన తన కుమార్తెలను చూసేందుకు జగన్ లండన్ కు వెళ్లారు.
ఈ రోజు రాత్రి అమరావతికి చేరుకుంటున్నారు. జగన్( CM Jagan ) లండన్ పర్యటనలోనే అనేక పరిణామాలు ఏపీలో చోటుచేసుకున్నాయి.స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేయడం, ఆయనను కోర్టులో ప్రవేశపెట్టడం, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం వంటివి చోటుచేసుకున్నాయి.ఇక ఈ రోజు రాత్రికి అమరావతి చేరుకోబోతున్న జగన్ చంద్రబాబు అరెస్టు పైన సమీక్ష చేయనున్నారు.
అలాగే రాబోయే రోజుల్లో వైసిపి ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశం పైన జగన్ వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోబోతున్నారు .ఏపీలో 175 స్థానాలకు 175ను గెలుచుకోవాలనే లక్ష్యాన్ని మరింతగా పార్టీ శ్రేణుల్లోకి తీసుకువెళ్లేందుకు ఆపరేషన్ 2024 కు జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు .ప్రతిపక్షాలకు ఏ అవకాశం దక్కకుండా ఎన్నికల్లో వైసిపి క్లీన్ స్వీప్ చేసే విధంగా జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారట.ఈ వారంలోనే సీఎం జగన్ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.
ఈనెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ సందర్భంగా పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో ముందుగానే వర్క్ షాప్ జగన్ ( CM Jagan )నిర్వహిస్తారట .ఇక పూర్తిగా జనాల్లో మమేకం అవుతూ , జనాల్లో తిరిగే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.ఇక ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు >( N Chandrababu Naidu )అరెస్టు జైలుకు వెళ్లడం తమ పార్టీకి సానుభూతిగా మారుతుందని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది.
కానీ అటువంటి దానికి అవకాశం లేదని చంద్రబాబు అరెస్టును ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని వైసిపి చెబుతోంది.