గంజాయి కేసులో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు: ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: మేళ్ళచెరువు పోలీసు స్టేషన్ పరిధిలో పట్టుబడిన గంజాయి కేసులో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.

బుధవారం గంజాయి నిందితున్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బుధవారం పోలీస్ సిబ్బంది మేళ్ళచెరువు మండల కేంద్రం రేవూరు రోడ్డులో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక విద్యార్థి వద్ద కొంత గంజాయి లభించినది, అతని సమాచారం మేరకు నిఘా ఉంచి జగ్గయ్యపేటకు చెందిన బొజ్జగాని రోహిత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకోవడం జరిగినదని, అతని వద్ద 120 గ్రాముల గంజాయి గుర్తించి సీజ్ చేశామన్నారు.విద్యార్థిపై, సరఫరా చేసే వ్యక్తిపై ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.

Case Registered Under NDPS Act In Ganja Case SP Rahul Hegde, Case Registered ,ND

జిల్లాలో గంజాయి వినియోగించే వారి, అమ్మే వారి,సరఫరా చేసే వారి పూర్తి సమాచారం ఉన్నదని, అందరిపై నిఘా ఉంచామని, గంజాయి సఫరా,అమ్మకం, త్రాగటం నేరమని,ఈ రకమైన నేరానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.గంజాయి వల్ల యువత భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు.

గ్రామీణ యువత,విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని,చిన్న చిన్న ప్యాకెట్ లలో గ్రామాలకు గంజాయి తెచ్చి యువతకు, విద్యార్థులకు అలవాటు చేసి తర్వాత అధిక ధరలకు విక్రయిస్తారని,ఇలాంటి వారి మాయలో పడొద్దని,గంజాయి మత్తుకు బానిసలు కావద్దని, తల్లిదంద్రులు,ఉపాద్యాయులు విద్యార్థుల,మీ పిల్లల అలవాట్లను గమనించాలని, వారు తప్పుదోవ పట్టకుండా చూడాలని,గంజాయి నిర్మూలనలో పోలీసు వారితో సహకరించి,సమాచారం అందించి,మీ పిల్లల భవిష్యత్తును కాపాడాలని కోరారు.గంజాయి పట్టుబడి చేయడంలో బాగా పని చేసిన ఎస్ఐ,సిబ్బందిని అభినందించారు.

Advertisement

ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ రాము,మేళ్ళచెరువు ఎస్ఐ పరమేష్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News