బన్నీ స్నేహారెడ్డి జోడీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ జోడీలలో ఒకటనే సంగతి తెలిసిందే.ఈరోజు బన్నీ భార్య స్నేహారెడ్డి ( Sneha Reddy )పుట్టినరోజు కాగా స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా క్యూటీ అంటూ బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.“హ్యాపీ బర్త్ డే క్యూటీ.సన్ షైన్ ఆఫ్ మై లైఫ్” అంటూ బన్నీ ప్రేమగా చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
బన్నీ ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
బన్నీ, స్నేహారెడ్డి జంటకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.అల్లు అర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాలో నటించగా అల్లు అయాన్ నటించే సినిమాకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.ఈరోజు స్నేహారెడ్డి పుట్టినరోజు కాగా అల్లు అర్జున్ వీడియో ద్వారా అల్లు అర్జున్( Allu Arjun ) ప్రేమను చాటుకున్నరు.2011 సంవత్సరంలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి వివాహం గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే.
బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉండగా వచ్చే ఏడాది ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.పుష్ప1 ఇండస్ట్రీ హిట్ గా నిలవగా పుష్ప2 సినిమా కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పుష్ప2( Pushpa 2 ) సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.స్నేహరెడ్డి, బన్నీ కలిసి నటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బన్నీ తర్వాత ప్రాజెక్ట్ లతో సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బన్నీ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉండగా బన్నీతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.