అధికారిక మీటింగ్ లో బీఆర్ఎస్ వాటర్ బాటిల్స్...!

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల నేపథ్యంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాలలో బీఆర్ఎస్ ముద్ర,స్థానిక నేత ఫోటోతో ముద్రించిన వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తూ అధికారిక మీటింగ్ లను గులాబీ పార్టీ మీటింగ్ లా మార్చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఆరోగ్య శాఖ అధికారులు నియోజకవర్గ స్థాయి ప్రగతిపై ఏర్పాటు చేసిన సమావేశంలోకేసీఆర్,ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఫొటోస్ తోవాటర్ బాటిల్ సరఫరా చేసినా అధికారులు కిమ్మనకుండా చూస్తూ ఉండిపోవడం పలు విమర్శలకు దారితీసింది.

భోజనాల కాంట్రాక్టు తీసుకున్న వ్యక్తులతో అధికార పార్టీ వాళ్లు కుమ్మక్కై వాటర్ బాటిల్ పై కూడా రాజకీయం చేస్తున్నారని,అధికారులు చూస్తూ ఉండడం తగునా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

విద్యుత్ వైర్లు తగిలి గడ్డి లోడు దగ్ధం

Latest Suryapet News