ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ వచ్చే ఎన్నికలకు గెలుపే లక్ష్యంగా తమదైన వ్యూహాలతో ప్రజల్లో రకరకాల కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.
ఇక ఇదే తరహాలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్( BRS party ) కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా మారుతూ ఉంది.వచ్చే ఎన్నికలలో అన్నిచోట్ల పోటీ చేస్తున్నట్లు ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ వెల్లడించడం తెలిసిందే.
ఇందుకు అందుగుణంగానే ఆ పార్టీలో ఏపీలో భారీగానే చేరికలు జరుగుతున్నాయి.శనివారం హైదరాబాద్( Hyderabad ) లో బీఆర్ఎస్ ఏపీ పార్టీ క్యాంపు కార్యాలయంలో పలువురు నేతలు పార్టీలో జాయిన్ అయ్యారు.
కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు, రాధా రంగా మిత్రమండలి తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆర్కట్ కృష్ణ ప్రసాద్ సహా పల్లి జిల్లాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్( Thota Chandrasekhar మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విపరీతంగా నిత్యవసర ధరలు పెరిగాయని కరెంటు చార్జీలతో సహా పేద మధ్యతరగతి కుటుంబాలు బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయాలని తోట చంద్రశేఖర్ సూచించారు.