బీఆర్ఎస్ మునిగి పోతున్న పడవ:పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని,ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న పడవని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలో 43 వ వార్డులో వార్డు కౌన్సిలర్ నామ అరుణప్రవీణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు గుంజ శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలను విభజించి పాలించి లబ్ధి పొందే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు,కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని తెలిపారు.ఎన్నడూ లేని విధంగా కర్ణాటక రాష్ట్రంలో 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం చరిత్ర అని,ఈ గెలుపు వెనుక భావి ప్రధాని రాహుల్ గాంధీ,ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే,ప్రియాంక గాంధీ కృషి ఉందన్నారు.

Brs Is A Sinking Boat Patel Ramesh Reddy-బీఆర్ఎస్ ముని�

బీజేపీ,బీఆర్ఎస్ పాలనలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు.తెలంగాణ రాష్ట్రం కేవలం సీఎం కేసీఆర్ ఆయన కుటుంబం కోసమే వచ్చిందని,జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ఆయన బినామీలు మాత్రమే రాష్ట్ర ఫలాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని నమ్మి కాంగ్రెస్ లో చేరుతున్నారని,సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని,అనేకమంది బీఆర్ఎస్ నాయకులు తనకు టచ్ లో ఉన్నారని త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్నారు.అవినీతిలో కూరుకుపోయిన మంత్రి జగదీష్ రెడ్డిని సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఓడించి నాగారానికి పంపించడానికి ప్రజల సిద్ధమయ్యారన్నారు.

Advertisement

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 43 వ వార్డులో కమ్యూనిటీ హాల్ నిర్మించి ప్రజలకు అందుబాటులో తెస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో 43వ వార్డు నుండి రాంబాబు,రవి,మొక్కల రవి,గుంజ వంశీ,భక్తుల సాయికిరణ్,జగన్, మహేష్,విక్కీ,ఉదయ్, శివమ్మ,వరలక్ష్మి,గంగమ్మ, రంగమ్మ,సైదులు,బాబు, నాగరాజు,లక్ష్మయ్య, యశ్వంతు,విజయ్, జయమ్మ,స్వప్న, అనసూయ,కుమారి, కవిత తదితరులు ఉన్నారు.

Advertisement

Latest Suryapet News