గుమ్మడవెల్లి ఐకెపి సెంటర్లో దళారి వ్యవస్థ

సూర్యాపేట జిల్లా: గుమ్మడవెల్లి ఐకేపీ సెంటర్లో రైతులు ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కాంటాలు వేయకుండా, ప్రక్క గ్రామాల నుండి వచ్చిన ధాన్యం కొనుగోలు చేస్తున్నారని గ్రామ అధికార పార్టీకి చెందిన సర్పంచ్ మంగళవారం మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఐకేపీ సెంటర్లో స్థానిక రైతుల ధాన్యం నిల్వలు మిగిలిపోవటంతో ఇదేమి పద్దతని నిర్వాహకులను రైతులు అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండని దురుసుగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు.

తేమశాతం 17 కన్నా తక్కువ ఉన్నా కొనుగోలు చేయాలని,కాంటాల విషయంలో అవకతవకలు లేకుండా చూడాలని స్థానిక ఎమ్మార్వో సూచించినా, ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కిన సెంటర్ నిర్వాహకులు ఇష్టానుసారంగా పక్క గ్రామాల రైతుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారని,మిల్లర్లతో కుమ్మక్కై రాత్రికి రాత్రే రైస్ మిల్లులకు పంపిస్తున్నారని,ప్రతి ఒక్క లోడుకు క్వింటా ఒక్కంటికి మూడు కేజీల నుండి 5 కేజీల వరకు తరుగు విధిస్తూ లారీలపై లోడ్ వేసి పంపించే దళారీ వ్యవస్థ ఏర్పడిందని ఆరోపించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఐకేపీ సెంటర్లో నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఐకెపి సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ పక్క గ్రామాల ధాన్యం కొనుగోలు చేసినది వాస్తవమేనని, స్థానిక గ్రామ రైతులు ఇబ్బంది పడింది కూడా వాస్తవమేనని,ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పడం గమనార్హం.

అల్లు అర్జున్ కాళ్ళ ముందు పడ్డ ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ భార్య.. ఏమైందటే?
Advertisement

Latest Suryapet News