కేకేఆర్ ను కట్టడి చేసిన బౌలర్లు ..చెన్నై టార్గెట్ 168 !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు షేక్ జాయేద్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ లో కోల్ ‌కత్తా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు ఆలౌట్ అయింది.చెన్నైకి 168 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.కోల్ ‌కత్తా ఓపెనర్ గిల్ 11 పరుగులతో నిరాశపరిచినప్పటికీ మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి నిలకడగా ఆడి జట్టుకి గౌరవప్రదమైన స్క్రోర్ అందించారు.51 బంతుల్లో 3 సిక్స్‌లు, 8 ఫోర్లతో 81 పరుగులు చేశాడు.

 Kkr, Csk, Chennaisuperkings, Dhoni ,ipl,rahultripathi-TeluguStop.com

రాహుల్ తర్వాత కోల్‌కత్తా ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు సాధించింది బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ ఒక్కడు మాత్రమే.కమిన్స్ 9 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మిగిలిన అందరూ కూడా చెన్నై బౌలర్ల దాటికి నిలబడలేకపోయారు.చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడం, ఫీల్డర్లు సమర్థంగా వ్యవహరించడంతో కోల్‌కత్తా ఓ మాదిరి స్క్రోర్ కే చాపచుట్టేసింది.

నితీష్ రాణా(9), సునీల్ నరైన్(17), కమ్మిన్స్(17), దినేష్ కార్తీక్(12), మోర్గాన్(7), రస్సెల్ 2 పరుగులు చేశాడు.నగర్‌కోటి, శివమ్ మావి డకౌట్‌గా వెనుదిరిగాడు.వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగు చేసి రనౌట్ ‌‌గా పెవిలియన్ కి చేరాడు.ఇక చెన్నై లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube