ఎన్నికలలో పంపిణీ చేసే వస్తువులపై సరిహద్దు నిఘా

సూర్యాపేట జిల్లా:తెలంగాణ ఎన్నికల( Telangana election ) విధులలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్ లో తనిఖీలు ముమ్మరం చేసింది.శుక్రవారం రాత్రి సరైన పత్రాలు లేని రూ.

31,64,243 విలువగల రెడీమేడ్ దుస్తులు మరియు రూ.1,17,930 విలువ గల టాయ్స్ ను గుర్తించి సీజ్ చేసి సంబంధిత ఎన్నికల అధికారులకు అప్పగించారు.ఈ సందర్భంగా నల్గొండ డివిజన్ వాణిజ్య పనుల జాయింట్ కమిషనర్ రాజాకృష్ణ(R ajakrishna ) మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తో సరిహద్దుగా గల ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాణిజ్య పన్నుల శాఖ( Commercial Taxes Department ) సిబ్బందిని ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.

సరైన పత్రాలు లేని వస్తువులను తరలించినా మరియు ఎన్నికలకు పంపిణీ చేసే వస్తువులను తరలించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ తనిఖీలలో ఏసిటీవోలు పషియుద్దీన్, బి.శ్రీను,సిబ్బంది పాల్గొన్నారు.

Border Surveillance Of Election Distribution Items-ఎన్నికలలో �

Latest Suryapet News