నర్సింహులగూడెంలో బొంత శ్రీనివాస్ రెడ్డి వర్ధంతి వేడుకలు

సూర్యాపేట జిల్లా:డివైఎఫ్ఐ కోదాడ డివిజన్ మాజీ అధ్యక్షుడు,తాడ్వాయి సింగిల్ విండో మాజీ చైర్మన్,సీపీఎం మునగాల మండల నేత కామ్రేడ్ బొంత శ్రీనివాస్ రెడ్డి 15 వర్ధంతి వేడుకలను మంగళవారం మునగాల మండల పరిధిలోని నర్సింహులగూడెంలో సీపీఎం గ్రామ శాఖా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద బొంత శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం సీపీఎం డివిజన్ నాయకులు రాపోలు సూర్యనారాయణ మాట్లడుతూ మునగాల మండల పరిధిలోని అనేక ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసి,ఎర్రజెండాను సమున్నతంగా ఎగరేసిన ధీశాలి కామ్రేడ్ బొంత శ్రీనివాస్ రెడ్డి అని కొనియాడారు.గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను కూడగట్టి రైతు,కూలీ హక్కుల కోసం ఉద్యమించిన నాయకుడని గుర్తు చేశారు.

Bontha Srinivas Reddy's Death Anniversary Celebrations At Narsimhulagudem-�

బొంత శ్రీనివాస్ రెడ్డి ఆశయ సాధనలో ప్రతీ ఒక్కరూ నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జూలకంటి కొండారెడ్డి, మాజీ ఎంపీటీసీ జూలకంటి విజయలక్ష్మి,మాజీ సింగిల్ విండో ఛైర్మన్ బొంత విజయలక్ష్మి,గ్రామ సీపీఎం నాయకులు జూలకంటి లచ్చిరెడ్డి,సోమపంగు ఈదయ్య,సొనపంగు గురవయ్య,బండి శీను,పెద్ది సురేష్,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?
Advertisement

Latest Suryapet News