లేడి దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సురారైపోట్రు.తెలుగులో ఈ సినిమా ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ చిత్రానికి గాను ఉత్తమ దర్శకురాలిగా సుధా కొంగర జాతీయ ఉత్తమ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు అదేవిధంగా ఉత్తమ నటుడిగా సూర్య జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు.ఇకపోతే సుధా కొంగర ఈ చిత్రాన్ని ఎయిర్ డెక్కర్ ఫౌండర్ జి ఆర్ గోపీనాథ్ రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు.

ఇక ఈ చిత్రాన్ని సూర్య సొంత ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గునీత్ మోంగా కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకోవడంతో దర్శకురాలు సుధా కొంగరకు తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి.తెలుగులో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి ఈమెకు అవకాశం వచ్చినప్పటికీ ఈమె ఎంతో సున్నితంగా తిరస్కరించి మరొక ప్రముఖ వ్యాపారవేత్త బయోపిక్ సినిమా పనులలో బిజీగా ఉన్నారట.

డైరెక్టర్ సుధా కొంగరకు భారతీయ లెజెండరీ బిజినెస్ మెన్ రతన్ టాటా బయోపిక్ చేసే అవకాశం రావడంతో ఈమె ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నారు.రతన్ టాటా పాత్రలో సూర్యా లేదా అభిషేక్ బచ్చన్ నటించబోతున్నారని సమాచారం.త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో రతన్ టాటా పాత్రలో నటించడానికి ముందుగా మహేష్ బాబుని అనుకున్నట్టు తెలుస్తుంది.మహేష్ బాబు ఇప్పటివరకు ఎలాంటి బయోపిక్ చిత్రాలలో నటించలేదు.అయితే రతన్ టాటా బయోపిక్ అని తెలియగానే మహేష్ ఆసక్తి చూపించినప్పటికీ ఆయన కాల్ షీట్స్ లేకపోవడంతో అభిషేక్ బచ్చన్ సూర్యని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.







