మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీలో పులి కలకలం సృష్టిస్తోంది.బుచ్చింపేట గ్రామంలో మేకపై పులి దాడికి చేసి చంపేసింది.
గ్రామాలకు స్థానికంగా ఉన్న జాంతికొండపై పులి సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు సమీప ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ క్రమంలో పులి పాదముద్రలను గుర్తించిన అధికారులు పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు.పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.







