యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడంతో ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు.
ఈ సినిమాతో తారక్ గ్లోబల్ వైడ్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు.ఇటీవలే ఎన్టీఆర్ కొత్త లుక్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇది నెక్స్ట్ సినిమా కోసం కాదని.కేవలం ఒక యాడ్ షూట్ కోసం మాత్రమే ఎన్టీఆర్ ఈ లుక్ లోకి వచ్చాడని వార్తలు వచ్చాయి.ఇక ఇప్పుడు ఆ యాడ్ ఏంటో తెలిసి పోయింది.అతి త్వరలోనే ఎన్టీఆర్ ఈ కమర్షియల్ యాడ్ ద్వారా బ్లాస్టింగ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటూ అధికారికంగా ప్రకటించారు.
ప్రముఖ ఫుడ్ బ్రాండింగ్ సంస్థ లిషియస్ తో ఎన్టీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారట.
ఇప్పటికే యాడ్ షూట్ కూడా జరిగింది అని తెలుస్తుంది.
మరి త్వరలోనే బ్లాస్టింగ్ ఎంట్రీ కోసం సిద్ధం అవ్వండి అంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా లిషియస్ సంస్థ వారు ప్రకటించారు.ఈ పోస్ట్ చేస్తూ తారక్ బ్లాక్ కలర్ ట్రెండీ స్టైల్ సూట్ లో బ్యాక్ సైడ్ నుండి దిగిన పిక్ ను షేర్ చేసారు.
దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.

మరి ఈ యాడ్ ఎలా ఉండబోతుందో అని తారక్ ఫ్యాన్స్ లో ఒక ఉత్సాహం అనేది కనిపిస్తుంది.ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు.అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.
ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.
ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.చూడాలి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.







