10 కోట్లతో బద్ది పోచమ్మ ఆలయ బోనాల మండపం!

వేములవాడ( Vemulawada ) రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ( Pochamma Temple ) కోసం రు.18.

50 కోట్ల రూపాయలతో సేకరించిన ఎకరం స్థలంలో అధునాతన వసతి సౌకర్యాలతో చేపట్టనున్న బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ నివేదికలు తుది దశకు చేరుకున్నాయి.10 కోట్ల రూపాయలతో బోనాల మండపం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పటికే నివేదికలు రూపొందించారు.ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు నేడు రాజన్న ఆలయ డి.

ఈ రఘునందన్( Raghunandan ) తో కలిసి మరోసారి నివేదికలను పరిశీలించారు.చేయవలసిన మార్పులు చేర్పులపై సుదీర్ఘంగా చర్చించారు.భక్తులకు అధునాతన వసతి సౌకర్యాలతో పాటు నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేసే విధంగా నిర్మాణం పనులు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.12 కోట్ల రూపాయలతో బండ్ ఆధునీకరణకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో నివేదికలు రూపొందిస్తున్నమని ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా బండ్ సుందరీకరణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.హైదరాబాదులో రెండు రోజుల తర్వాత బండ్ సుందరీకరణ పై సంబంధిత అధికారులతో పూర్తిస్థాయిలో చర్చించి నివేదికలను పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నివేదికలు పూర్తి అయిన తర్వాత మంత్రి కేటీఆర్( Minister KTR ) గారితో పనులు ప్రారంభించేందుకు సిద్దం చేస్తున్నారు.రు.5 కోట్లతో మిగిలిన స్టేడియం పనులు పూర్తి చేయడానికి నేడు సాంఘిక, సంక్షేమ అధికారులతో సమీక్ష జరిపి ఆగస్ట్ నాటికి పూర్తి చెయ్యాలని ఆదేశించారు.గురువారం నాడు మరోమారు డబల్ బెడ్ రూం ఇండ్లు, రోడ్ వైడనింగ్ పనులకు రెవెన్యూ, హౌసింగ్, ఆర్ అండ్ బి అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపి త్వరలో విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు.

ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Latest Rajanna Sircilla News