బాలీవుడ్( Bollywood ) లో ఒకప్పుడు వందల కోట్ల సినిమా లు చాలా కామన్ గా వస్తూ ఉండేవి.కానీ కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా తారు మారు అయింది.
ఇప్పటి వరకు స్టార్ హీరో లు కూడా రెండు మూడు వందల కోట్ల సినిమా లు పెద్దగా చేసిన దాఖలాలు కనిపించడం లేదు.కానీ షారుఖ్ ఖాన్ మాత్రం ఈ ఏడాది లోనే ఇప్పటి వరకు రెండు వెయ్యి కోట్ల సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
అందులో రెండు కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవడం వల్ల ఆయన అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకోవడం జరిగింది.ఈ ఏడాది ఆరంభం లో పఠాన్( Pathaan ) తో వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన షారుఖ్ ఖాన్ తాజాగా వచ్చిన జవాన్ సినిమా తో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఈ రెండు సినిమా లు కూడా బాలీవుడ్ కి పెద్ద రిలాక్స్ ని అందించాయి.ఇక ఇదే ఏడాది డుంకీ సినిమా( Dunki ) తో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈసారి హిరానీ దర్శకత్వం లో షారుఖ్ ఖాన్ చేయబోతున్న మ్యాజిక్ కి కచ్చితంగా వెయ్యి కోట్లు రావడం ఖాయం అన్నట్లుగా బాలీవుడ్ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కి మూడవ వెయ్యి కోట్లు ఈ 2023 లోనే వస్తాయి అన్నట్లుగా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న డుంకీ సినిమా ను క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా మరోసారి షారుఖ్ ఖాన్ క్లారిటీ ఇచ్చాడు.అదే నిజం అయితే 2023 సంవత్సరం లో షారుఖ్ ఖాన్( Sharukh khan ) నుండి మూడు సినిమా లు వచ్చినట్లు అవుతాయి.
ఆ మూడు సినిమా లు కూడా మూడు వెయ్యి కోట్ల వసూళ్ల ను నమోదు చేసినట్లుగా అవుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు.ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ తో పోల్చితే డుంకీ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతున్నట్లుగా బాలీవుడ్ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.మొత్తానికి మూడవ వెయ్యి కోట్లు కచ్చితంగా షారుఖ్ కి సాధ్యమే.ఒకే ఏడాది లో మూడు వెయ్యి కోట్ల సినిమా లు కేవలం షారుఖ్ కి మాత్రమే సాధ్యం.
రాబోయే పదేళ్లలో ఏ ఒక్కరు అయినా ఈ ఘనత సాధించేనో చూడాలి.