డీసీఎంఎస్ నూతన చైర్మన్ గా బోళ్ల వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం

నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా నల్లగొండ జిల్లా కేతపల్లి పిఎసిఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బోళ్ల వెంకటరెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రికి డీసీఎంఎస్ పాలక మండలి,అధికారులు ఘన స్వాగతం పలికారు.ప్రమాణ స్వీకారం అనంతరం బోళ్ల వెంకట రెడ్డిని మంత్రి స్వయంగా చైర్మన్ ఛాంబర్ వరకు తీసుకెళ్లి చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి,శాలువా,పూలమాలతో సత్కరించి,నియామక పత్రాన్ని అందజేశారు.

Bolla Venkata Reddy Sworn In As The New Chairman Of DCMS, Bolla Venkata Reddy ,

కొంతకాలంగా వైస్ చైర్మన్ గా ఉన్న దుర్గంపూడి నారాయణరెడ్డి ఇన్చార్జి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.డీసీఎంఎస్ లోని డైరెక్టర్లందరూ కేతపల్లి పిఎసిఎస్ చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డిని డిసిఎంఎస్ చైర్మన్ గా ఎన్నుకోవడంతో నూతన చైర్మన్ గా నల్గొండ పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా పలువురు డైరెక్టర్లు నూతన చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిసిఓ కిరణ్ కుమార్,డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ నాగిళ్ల మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

డీసీఎంఎస్ నూతన పాలక వర్గం:బోళ్ళవెంకట్ రెడ్డి (చైర్మన్),దుర్గంపూడి నారాయణరెడ్డి(వైస్ చైర్మన్), డైరెక్టర్లుగా గుడిపాటి సైదులు, ధనాపత్ జయరాం,దొంగర వెంకటేశ్వర్లు,నెల్లూరు ఉషారాణి,ఎస్.అనురాధ,కొండ సరిత,కర్నాటి లింగయ్య కొనసాగుతున్నారు.

మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?
Advertisement

Latest Nalgonda News