సాగర్ కెనాల్ ను పరిశీలించిన బీజేపీ నాయకులు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువను బీజేపీ నాయకులతో కలిసి గురువారం హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే,నల్లగొండ బీజేపీ ఎంపి అభ్యర్ధి శానంపుడి సైదిరెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ నీటితో చెరువులు,కుంటలు నింపి ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

గ్రామాల్లో తాగునీటికి ప్రజలు అల్లాడుతుంటే ఈ జిల్లాకు విడుదల చేయకుండా అక్రమంగా ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించడం దుర్మార్గమన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

నేరేడుచర్ల పరిసరాలను కమ్మేసిన దట్టమైన పొగ మంచు

Latest Suryapet News