తెలంగాణలో బీజేపీకి స్కోప్ ఉంది: సునీల్ బన్సల్

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి మంచి వాతావరణం ఉందని బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర ఇంచార్జీ సునీల్ బన్సల్ అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నల్లగొండ పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమెందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని,ప్రధాని మోడీ పాలన తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గడప గడపకు ప్రజలకు వివరించాలని సూచించారు.నల్గొండ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్లు, బీజేపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డీ, బోబ్బా భాగ్యరెడ్డీ,బీజేపి రాష్ట్ర కార్యదర్శి మాదగొని శ్రీనివాస్ గౌడ్,బీజేపి జిల్లా ఇంచార్జీ ఆర్.ప్రదీప్ కుమార్,బీజేపి కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి, మిర్యాలగూడ ఇంచార్జీ, సినీ నటి కవిత,బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నర్సింహ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్,కన్మంత రెడ్డీ శ్రీదేవిరెడ్డీ,బీజేపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు..

రేపు వైన్ షాపులు మాంసం దుకాణాలు బంద్
Advertisement

Latest Nalgonda News