వైట్ కాలర్ నేరగాళ్లను బీజేపీ దేశం దాటించింది..: మంత్రి హరీశ్ రావు

రంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు.ఇందులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.

 Bjp Has Crossed The Country With White Collar Criminals..: Minister Harish Rao-TeluguStop.com

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వలనే మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ వచ్చిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.జిల్లాకొక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకున్నామన్న ఆయన తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదని పేర్కొన్నారు.

రాష్ట్ర నిధులతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు.రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

వైట్ కాలర్ నేరగాళ్లను బీజేపీ దేశం దాటించిందని ఆరోపించారు.విపక్షాల మాటలకు విలువ లేదన్న ఆయన కేసీఆర్ పాలనకు తిరుగులేదని వెల్లడించారు.

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్రాన్ని మార్చామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube