వైట్ కాలర్ నేరగాళ్లను బీజేపీ దేశం దాటించింది..: మంత్రి హరీశ్ రావు

రంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు.ఇందులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వలనే మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ వచ్చిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

జిల్లాకొక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకున్నామన్న ఆయన తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదని పేర్కొన్నారు.

రాష్ట్ర నిధులతో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు.రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

వైట్ కాలర్ నేరగాళ్లను బీజేపీ దేశం దాటించిందని ఆరోపించారు.విపక్షాల మాటలకు విలువ లేదన్న ఆయన కేసీఆర్ పాలనకు తిరుగులేదని వెల్లడించారు.

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్రాన్ని మార్చామని తెలిపారు.

యజమాని దగ్గర నుంచి మసాజర్‌ తీసుకున్న పిల్లి.. తర్వాత ఏం చేసిందో చూస్తే..