ఆ హీరోయిన్ కి చేదు అనుభవం... అర్ధరాత్రి బాల్కనీలోకి దూకేసాడంటూ కామెంట్స్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) గురించి పరిచయం అవసరం లేదు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ నీ ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు.ఇలా పెళ్లయిన తర్వాత ఈమె పూర్తిగా బాలీవుడ్ సినిమాలకు దూరమై హాలీవుడ్ సినిమాలు, సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉండిపోయారు.

 Bitter Experience For That Heroine Comments Like Jumping Into The Balcony In The-TeluguStop.com

తాజాగా ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్( Citadel ) వెబ్ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియాంక చోప్రా తన బాల్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ తాను చదువుకోవడానికి 12 ఏళ్ల వయసులోనే తన తండ్రి తనని యూఎస్ పంపించారని తెలిపారు.ఇలా యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఓ రోజు రాత్రి జరిగిన ఓ సంఘటన గురించి ఈమె బయట పెట్టారు.ఒకరోజు అర్ధరాత్రి ఒక యువకుడు తన ఇంటి బాల్కనీలోకి దూకారని ప్రియాంక చోప్రా వెల్లడించారు.ఇలా ఓ వ్యక్తి అర్థరాత్రి ఇంటి బాల్కనీలోకి దూకడంతో తాను గట్టిగా కేకలు వేశానని తెలిపారు.

ఆ దెబ్బకు తన తండ్రి తన రూమ్ కిటికీ మొత్తం తొలగించారని తెలిపారు.

ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత తన తండ్రి తనకు చెబుతూ నువ్వు యూఎస్ లో లాగా ఇక్కడ కూడా జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతానంటే తాను ఒప్పుకోనని చెప్పేవారు.అలాగే తాను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా తనతో పాటు మరొకరిని తోడు పంపించేవారని ప్రియాంక చోప్రా వెల్లడించారు.అయితే ఆ సమయంలో తాను చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ నాన్న అప్పుడు అలా ఎందుకు చేశారో తనకు ఇప్పుడు అర్థం అవుతుందని,నాన్నను కోల్పోవడం నిజంగా నా దురదృష్టం అంటూ ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube