బిగ్ బాస్ సీజన్ 6 లో గడిచిన ఐదు రోజుల ఎపిసోడ్ లోనే హౌజ్ లో అందరు ఒక కంటెస్టంట్ ని టార్గెట్ చేస్తున్నారు.అది కూడా సింగర్ గా సూపర్ క్రేజ్ ఉన్న రేవంత్ ని హౌజ్ లో అందరు టార్గెట్ చేస్తున్నారు.
అయితే రేవంత్ కూడా అవతల వాళ్లు చెప్పేది వినకుండా తను మాట్లాడిందే కరెక్ట్ అన్న భావనలో ఉంటున్నాడు.నామినేషన్స్ లో అతనికి దాదాపు 8 ఓట్స్ రావడానికి ఇదే కారణమని చెప్పొచ్చు.
ఇక ఇదిలాఉంటే బిగ్ బాస్ సీజన్ 6 లో రేవంత్ నడవడిక చూసి ఇతను బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్ ని ఫాలో అవుతున్నాడని చెప్పుకుంటున్నారు.
సీజన్ 2లో కూడా అంతే హౌజ్ అంతా ఒకటి అయితే కౌశల్ ఒక్కడే ఒక్కడు అన్న ఫీలింగ్ వచ్చేలా చేశాడు.
అయితే అప్పుడు కౌశల్ కి ఆడియన్స్ అండగా ఉండి అతన్ని టైటిల్ విన్నర్ ని చేశారు.అయితే అప్పుడు బిగ్ బాస్ కేవలం ఆ టీం చేసిన 1 అవర్ కట్ తో ఓటింగ్స్ పడ్డాయి.
కానీ ఇప్పుడు ఈ షో 24 గంటలు వస్తుంది.మెయిన్ ఎపిసోడ్ లో గొడవని హైలెట్ చేసినా దానికి ముందు వెనక ఏంటన్నది డిస్నీ హాట్ స్టార్ లో చూసేయొచ్చు.
అందుకే ఒకవేళ కౌశల్ లా తను ఒంటరిగా ఉంటే ఆడియన్స్ తన వెంట ఉంటారని రేవంత్ భావిస్తే అతను పొరపాటు చేసినట్టే అవుతుంది.