అద్దెలతోనే రూ.కోట్లు సంపాదిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకొని భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటారు.ఇలా ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాగా సంపాదించిన సెలబ్రిటీలు వారి డబ్బును మొత్తం వెంచర్లు, ఫ్లాట్స్ కొనుగోలు చేసి వాటిని అద్దెకిస్తూ లాభాలను పొందుతూ ఉంటారు.

 Who Is The Bollywood Star Hero Who Is Earning Rs Crores From Rent Alone , Bollyw-TeluguStop.com

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలో ఖరీదైన ఫ్లాట్లో వెంచర్లపై పెట్టుబడులు పెట్టి నెలకు లక్షల్లో లాభాలను పొందుతున్నారని చెప్పాలి.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సల్మాన్ ఖాన్ సైతం ఇదే కోవకు చెందుతారు.

సల్మాన్ ఖాన్ ఇప్పటికీ సింగిల్ గా ఉన్నప్పటికీ ఈయన వరుస సినిమాలలో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.ఈ క్రమంలోనే ముంబైలో పలు ప్రాంతాలలో ఈయనకు ఖరీదైన ఆస్తిపాస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈయనకు ముంబైలోని సబర్బన్ లోని ఎంతో ఖరీదైన స్థలం కలిగి ఉందని, అయితే ఆ స్థలాన్ని సల్మాన్ ఖాన్ ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ కి లీజుకు ఇచ్చారని తెలుస్తోంది.

Telugu Salman Khan, Bollywood, Areas Mumbai, Per, Suburban Mumbai, Tnsi Retail P

ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ కు అనుబంధంగా ఉన్న TNSI రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కు లీజుకు ఇచ్చాడు.సెప్టెంబరు 5న లీజును పునరుద్ధరించారు.ఇలా ఈయన లీజుకు ఇచ్చినందుకుగాను నెలకు సదరు రిటైల్ గ్రూప్స్ సంస్థ 89.6లక్ష రూపాయల అద్దె చెల్లిస్తున్నారని తెలుస్తుంది అయితే ఇది మొదటి ఏడాది మాత్రమే అలాగే రెండవ ఏడాది ఏకంగా 94.08 లక్షల రూపాయలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.ఇలా నెలకు కోటి రూపాయల అద్దె తీసుకుంటున్నటువంటి ఈ స్థలం ఏకంగా 27650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.ఇలా కేవలం అద్దె ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube