సైకిలే హస్తం నేత ప్రచార రథం...!

నల్లగొండ జిల్లా:రాజకీయ పార్టీల ఎన్నికల చిత్రాలు ఇన్నిన్ని కావయా.ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నాయకులు పడరాని పాట్లు పడుతుంటారు.

అలాంటి చిత్రవిచిత్ర విన్యాసాలను ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తుంటారు.ఆ కోవకు చెందిందే నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ( Nagarjuna Sagar Assembly constituency )పరిధిలోని త్రిపురారం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కసిరెడ్డి నరేష్( Naresh Kasireddy ) సైకిల్ పై చేస్తున్న హస్తం పార్టీ ప్రచారం.

Bicycles Are The Campaign Congress Leader Nagarjuna Sagar , Assembly Constituenc

ఇప్పుడు అది అందరినీ ఆకర్షిస్తుంది.కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా సైకిల్ పై వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టానని,సాగర్ నియోజకవర్గంలో అధిక శాతం గిరిజన తండాలు ఉండడంతో కొన్ని ప్రాంతాలకు మోటార్ సైకిల్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని,అలాంటి చోటికి కూడా ఈ సైకిల్ పై వెళ్ళి ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని ఆలోచించి సైకిల్ ప్రచార రథాన్ని తయారు చేయించినట్లు చెప్పారు.

ముందుగా త్రిపురారం మండలం నుండి ప్రారంభించి,కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైవీర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు,ఈ సైకిల్ ప్రచార రథంతో ఖర్చు కూడా కలిసి రావడంతో పాటు గ్రామ గ్రామానికి కాంగ్రెస్ జెండాను చేర్చే అవకాశం దక్కుతుందన్నారు.

Advertisement
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News