రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని దావోస్ లో కుదిరిన ఒప్పందాలని మళ్లీ విశాఖ సమితిలో చూపిస్తూ అంకెల గా గారడీ చేస్తున్నారని, విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదని ఫేక్ సమ్మిట్ అని విమర్శించారు పీపీఏ లను రద్దుచేస్తూ పరిశ్రమలను తరిమేసిన ఈ ప్రభుత్వానికి పారిశ్రామిక అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందంటే ఎవరూ నమ్మరని టిడిపి హయాంలో తెలంగాణ కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్ కి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు.మద్యం కంపెనీలను గంజాయి బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ దానినే అభివృద్ధి అనుకోమంటారని ఎద్దేవా చేశారు .
భారతి సిమెంట్స్ ను అభివృద్ధి చేయడం ఒక్కటే పారిశ్రామిక అభివృద్ధి కాదని జగన్ తెలుసుకోవాలన్నారు.కుదిరిన ఒప్పందాల్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తూ లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారని వాస్తవ రూపం దాల్చి ఉత్పత్తి మొదలుపెట్టిన ఒక కంపెనీని చూపించాలని సవాలు విసిరారు పీలేరులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు టిడిపి హయాంలో నెలకొల్పిన పరిశ్రమల ముందు నిలబడి నేను సెల్ఫీ దిగుతానని, మీ హయాంలో నెలకొల్పిన పరిశ్రమల ముందు నిలబడి మీరు సెల్ఫీ దిగగలరా అని ప్రశ్నించారు.కంచుకోట లాంటి ప్రాంతంలో నిలబడి గెలిచి జబ్బులు చరుచుకోవడం కాదని అనుకూలంగా లేని నియోజకవర్గం లో కూడా పోటీ చేసి గెలవాలని ఈ సందర్భంగా సవాలు చేశారు మంగళగిరిని గెలిచి దానిని టిడిపి కంచుకోటగా మారుస్తానని కూడా శపథం చేశారు.
ఏది ఏమైనా తన మాటతీరు గురించి ప్రవర్తన గురించి విపరీతమైన హేళనకు గురైన లోకేష్ గత కొంతకాలంగా తన బలహీనతలన్నీ అధిగమిస్తూ దూసుకుపోతున్నారని చెప్పాలి తనని తాను కొత్తగా నిర్మించుకుంటూ అడుగులు వేస్తున్న లోకేష్ విమర్శలు చేయడంలో కూడా రాటు దేలినట్టుగా కనిపిస్తుంది మరి రాజకీయ యువనికపై ఆయన ఏ స్థాయి విజయాలు సాధిస్తారో రానున్న కాలం నిర్ణయిస్తుంది.