రాళ్లేసిన చేతులకు సన్మానాలు చేయటం దురదృష్టకరం తెలంగాణ గవర్నర్

అంతర్జాతీయ మహిళా దినాన్ని పురస్కరించుకొని రాజభవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ తన ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మహిళల పట్ల అనుచితంగా ప్రవహిస్తున్నవారికి జేజేలు కొడుతున్నారని అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళలకు కూడా అవమానాలు తప్పడం లేదని ఆమె అన్నారు .

 It Is Unfortunate That Telangana Governor Pays Tributes To Stoned Hands , Telang-TeluguStop.com

ఇలాంటి పరిస్థితి సమాజానికి తప్పుడు సంకేతాలను ఇస్తుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రం బలమైన సంస్కృతి కలిగిన రాష్ట్రమని ,రుద్రమదేవి పుట్టిన నేలని.

సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని మహిళా సమాజానికి సూచించారు.స్త్రీలను గౌరవించాలని ,సామాజిక మాధ్యమాల్లో ప్రవర్తన హుందాగా ఉండాలని సూచించారు.

ప్రతిభావంతురాలైన వైద్య విద్యార్థిని ప్రీతిని రక్షించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.ఒక మహిళకు అన్యాయం జరిగితే తాను వెంట ఉంటానని తనకు అన్యాయం జరిగినప్పుడు మహిళా సమాజం కూడా తన వెనుక ఉంటుందనె విశ్వాసం తనకు ఉందని ఆమె తెలిపారు

Telugu Preeti, Raj Bhavan-Telugu Political News

ఇబ్బందులు ఉన్నప్పటికీ సందర్భానుసారం కలిసి పోవాలి తాను ఈ సభకు అత్యంత సమర్థులు, విజయవంతమైన మహిళలందరికీ ఆహ్వానాలు పంపించానని అందులో చాలామంది ఈ సభకు హాజరు అవ్వలేదని ఆమె తెలిపారు.ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తే కుదరదని ,రాజకీయ సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పటికీ సందర్భానుసారం కలిసి పోవాలని ఆమె సూచించారు .మహిళా అభ్యున్నతి కోసం రాజ్ భవన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తాను అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మహిళ నని ఆమె తెలిపారు .

Telugu Preeti, Raj Bhavan-Telugu Political News

గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడటం తాను గమనించానని, వాళ్లకోసం తాను పౌష్టికాహార లడ్డూలు కూడా తయారు చేయించానని ని, టూవీలర్ అంబులెన్స్ లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని ,మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేయడం కోసం రాజభవన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి , జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ, ఐఏఎస్ అధికారిణి శైలజ రామయ్యర్ ,సినీనటి పూనమ్ కౌర్, టీఎస్పీఎస్సీ సభ్యురాలు అరుణకుమారి సుమిత్ర ఆనంద్ ఇతరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube