బెల్టు షాపు యజమానిపై వైన్స్ షాపు యజమాని దాడి

నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం( Gurrampode )లో వైన్స్ షాపు యజమానుల దాడులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని బెల్ట్ షాపుల నిర్వాహకులుఆరోపిస్తున్నారు.

వైన్స్ షాపు యజమానులు సిండికేటుగా మారి,తమ మాట వినని బెల్టు షాపులపై ఎక్సైజ్ శాఖ అధికారుల అవతారమెత్తి దాడులు చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మండలంలోని కొప్పోలు గ్రామంలో బెల్టు షాపు నిర్వాహకుడిపై వైన్స్ షాపు యజమానులు దాడి చేసి మద్యం బాటిళ్లు గుంజుకొనే ప్రయత్నం చేయగా,ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతవరణం ఏర్పడినట్టు సమాచారం.ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పూర్తిగా వైన్స్ షాపు యజమానులకు సహకరిస్తూ,వారు ఏం చేసినా తమకు సంబంధం లేనట్లు చూస్తూ ఉండిపోవడంతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Belt Shop Owner Assaulted By Wine Shop Owner, Belt Shop Owner , Gurrampode ,Na

నిత్యం వైన్స్ షాపుల వద్ద గొడవలు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో ఇది ఎక్కడికి దారితీస్తుందో అర్దం కావడం లేదని అంటున్నారు.గుర్రంపోడు చుట్టూ ఉన్న నాంపల్లి, చండూరు,కనగల్,మల్లేపల్లి మండలాల్లో ఎక్కడా సిండికేట్ దందా లేకపోయినా గుర్రంపోడు మండలంలో మాత్రమే మద్యం మాఫీయా చెలరేగిపోతుందని అనేక ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు సిండికేట్ దందాకు అడ్డుకట్ట వేస్తారా లేదా చూడాలి మరి.

Advertisement
భార్యల అక్రమ సంబంధాలకు.. భర్తలు బలి.. కొద్దిరోజుల్లోనే 12 మంది కాటికి.. అసలేం జరుగుతోంది?

Latest Nalgonda News