నందమూరి బాలకృష్ణ ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు హిట్స్ అందుకుని బాలయ్య కెరీర్ లోనే మంచి ఊపులో ఉన్నాడు.
ఇదిలా ఉండగా బాలయ్య ఎప్పుడు లేని విధంగా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు.తాజాగా ఏపీ లోని ఒక గోల్డ్ షాప్ ఓపెనింగ్ కోసం బాలయ్య విచ్చేశాడు.
ఈ క్రమంలోనే ఈయన అదిరిపోయే సెల్ఫీని తీసుకుని సర్ప్రైజ్ ఇచ్చాడు.ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.ఫ్యాన్స్ తో ఎంతో సంతోషంగా సెల్ఫీ తీసుకున్నాడు.బాలయ్య నుండి వచ్చిన ఈ వీర మాస్ సెల్ఫీ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉండగా వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.ఇక సెకండ్ షెడ్యూల్ కూడా మరికొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేయనున్నారు.‘NBK108‘ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెలలో స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.
నెక్స్ట్ షెడ్యూల్ లో ఈమె కూడా ఈ సినిమాలో జాయిన్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో బాలయ్యను పవర్ ఫుల్ రోల్ లో చూపించ నున్నట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మరి రెండు హిట్స్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకుంటాడో లేదో వేచి చూడాలి.