నెటిజన్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.. ?

సోషల్ మీడియా వల్ల లాభం ఉంది, నష్టం ఉందన్న విషయం తెలిసిందే.అయితే కొందరు నెటిజన్స్ మాత్రం సోషల్ మీడియాను తమ ఆగడాలకు అడ్డగా ఉపయోగించుకుంటున్నారు.

 Badminton Player Gutta Jwala Is Angry With Netizens, Badminton Player, Gutta Jwa-TeluguStop.com

సెలబ్రీటీలకు అసభ్యకరమైన మెసేజ్‌లను పెడుతూ పైశాచికమైన ఆనందాన్ని పొందుతారు.

ఇకపోతే నెటిజన్ల నుండి ఇబ్బందిని ఎదుర్కొన్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

దీనికంతటికి కారణం గుత్తా జ్వాల ఒక పోస్ట్ పెట్టడం.ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుంటే.చైనా దేశస్దురాలైన గుత్తా జ్వాల తల్లి ఎలాన్ వాళ్ల అమ్మగారు కొన్నిరోజుల కిందట చైనాలో మృతిచెందారు.తన అమ్మమ్మ చనిపోయిన విషయాన్ని జ్వాల సోషల్ మీడియాలో చైనీస్ న్యూ ఇయర్ రోజున అమ్మమ్మ కోవిడ్‌తో మరణించిందని వెల్లడించారు.

దీనిపై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ చైనీస్ వైరస్ అని అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావు? అంటూ జ్వాలను ప్రశ్నించడం మొదలెట్టారట.అంతే తన అమ్మమ్మ చనిపోయిన బాధలో ఉంటే, ఇలా జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం విస్మయం కలిగిస్తోందని జ్వాల ఆవేదనతో అన్నారట.

మనం బ్రతుకుతున్నది సమాజంలోనే కదా! సానుభూతి చూపవలసిన మనుషులు ఇలా ప్రవర్తించడం సిగ్గుపడాల్సిన విషయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube