మెగా అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మెగా హీరోలకు మేనేజర్ గారు, కంటెంట్ రైటర్ గా, పీఆర్వోగా పనిచేసే అనంతరం నిర్మాతగా మారినటువంటి వారిలో ఎస్కేఎన్( SKN )ఒకరు.తాజాగా ఈయన బేబీ సినిమా ( Baby Movie ) కు నిర్మాతగా వ్యవహరించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఒక చిన్న సినిమాగా విడుదలైనటువంటి ఈ చిత్రం సంచలనమైనటువంటి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాతో నిర్మాతగా ఎస్కేఎన్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ఈ సినిమా ద్వారా నిర్మాతకు కోట్లలో లాభాలను కూడా అందుకున్నారని చెప్పాలి.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్( Allu Arjun ) మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) వంటి వారు కూడా ప్రత్యేకంగా చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఘనంగా వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇలా నిర్మాతగా ఎస్కేఎన్ మరో మెట్టు పైకి ఎక్కారు.ఇక ఈ సినిమా తర్వాత తన నిర్మాణంలో మరో అద్భుతమైన కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఈయన ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా గణేష్ ఉత్సవాలు వైభవంగా ముగిసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ( Allu Aravind ) నిర్మాణ సంస్థ అయినటువంటి గీత ఆర్ట్స్ బ్యానర్ లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
వినాయకుడి నిమజ్జనం సందర్భంగా వినాయకుడి లడ్డూ( Laddu ) ను వేలం వేశారు.
ఇక ఈ లడ్డు వేలం పాటలో నిర్మాత ఎస్కేఎన్ రెండు లక్షలకు వేలంపాడి ఈ లడ్డూని సొంతం చేసుకున్నారు.ఇక ఈ విషయాన్ని ఈయన ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ ఏడాది గీత ఆర్ట్స్ గణేష్ లడ్డూని వేలం పాటలో సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
అందులోనూ అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా ఈ లడ్డు తీసుకోవడం మరింత సంతోషాన్ని ఇస్తుంది అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.