కీలక సమయంలో బాబు విడుదల-ఇక సైకిల్ దూసుకుపోతుందా?

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలై చాలా రోజులైపోయింది.తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండగా ఆంధ్రాలో మరో నాలుగు ఐదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి.

 Babu's Release At A Crucial Time -will Tdp Gear Up Toward Elections , Janasena,-TeluguStop.com

దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తి స్తాయి ఎన్నికల కోలాహాలం కనిపిస్తుంది.ఇలాంటి కీలక సమయంలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రిమాండ్ ఖైదీగా జైలులో చిక్కుకుపోవడంతో తెలుగుదేశం శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాయి.

దానికి తోడు జనసేన( janasena ) తో అత్యంత కీలకమైన పొత్తు చర్చలు, సంయుక్త కార్యాచరణ నిర్ణయించుకోవలసిన ప్రస్తుత తరుణంలో అన్ని తానై నడిపే బాబు లేకపోవడం తెలుగుదేశం కి అతిపెద్ద లోటుగా అవతరించింది.అయితే కీలక సమయంలో బాబుకు మధ్యంతర రిలీఫ్ దొరకడంతో ఇక చంద్రబాబు( Chandrababu ) తెలుగు దేశాన్ని శరవేగంగా పట్టాలెక్కిస్తారని తెలుస్తుంది.

ముఖ్యంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవలసిన చంద్రబాబు అందుబాటులో ఉండటంతో పూర్తిస్థాయిలో టిడిపి( TDP ) స్పీడ్ పెంచుతుందని తెలుస్తుంది.ఇప్పటికే జనసేన తెలుగుదేశం సంయుక్త సమావేశాలు జిల్లాల వారీగా జరుగుతున్నాయి.

ఇప్పుడిక సీట్ల సర్దుబాటును చంద్రబాబు ఒక కొలిక్కి తీసుకు వచ్చేస్తే అప్పడిక రెండు పార్టీలు ఎన్నికల ప్రచారం ద్వారా ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తాయ్.

Telugu Ap, Chandrababu, Janasena-Telugu Political News

ఇప్పటికే ప్రాథమికంగా ఒక అవగాహన కుదిరినప్పటికీ పూర్తిస్థాయి నిర్మాణాత్మక చర్చలు మాత్రం ఈ రెండు పార్టీల మధ్య జరగలేదు ఇప్పుడు నెల రోజులు పాటు బాబుకు పూర్తి సమయం దొరకడంతో ఇక పార్టీ నిర్మాణానికి అవసరమైన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను పూర్తి చేస్తారని జాతీయ స్థాయిలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై విధివిధానాలను ఖరారు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.బాబు అండ ఉంటే కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేసే వాతావరణం తెలుగుదేశంలో కనిపిస్తుంది .ఎందుకంటే తెలుగు దేశానికి ఏ- టు -జెడ్ చంద్రబాబు మాత్రమే కాబట్టి.దాంతో బాబు విడుదలతో తెలుగుదేశానికి సరికొత్త జోష్ వస్తుందని ఇక ఫుల్ స్పీడుతో టిడిపి పరుగులు పెడుతుందని బాబు అభిమానులు విశ్లేషణ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube