కీలక సమయంలో బాబు విడుదల-ఇక సైకిల్ దూసుకుపోతుందా?

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి మొదలై చాలా రోజులైపోయింది.తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండగా ఆంధ్రాలో మరో నాలుగు ఐదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తి స్తాయి ఎన్నికల కోలాహాలం కనిపిస్తుంది.

ఇలాంటి కీలక సమయంలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రిమాండ్ ఖైదీగా జైలులో చిక్కుకుపోవడంతో తెలుగుదేశం శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాయి.

దానికి తోడు జనసేన( Janasena ) తో అత్యంత కీలకమైన పొత్తు చర్చలు, సంయుక్త కార్యాచరణ నిర్ణయించుకోవలసిన ప్రస్తుత తరుణంలో అన్ని తానై నడిపే బాబు లేకపోవడం తెలుగుదేశం కి అతిపెద్ద లోటుగా అవతరించింది.

అయితే కీలక సమయంలో బాబుకు మధ్యంతర రిలీఫ్ దొరకడంతో ఇక చంద్రబాబు( Chandrababu ) తెలుగు దేశాన్ని శరవేగంగా పట్టాలెక్కిస్తారని తెలుస్తుంది.

ముఖ్యంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవలసిన చంద్రబాబు అందుబాటులో ఉండటంతో పూర్తిస్థాయిలో టిడిపి( TDP ) స్పీడ్ పెంచుతుందని తెలుస్తుంది.

ఇప్పటికే జనసేన తెలుగుదేశం సంయుక్త సమావేశాలు జిల్లాల వారీగా జరుగుతున్నాయి.ఇప్పుడిక సీట్ల సర్దుబాటును చంద్రబాబు ఒక కొలిక్కి తీసుకు వచ్చేస్తే అప్పడిక రెండు పార్టీలు ఎన్నికల ప్రచారం ద్వారా ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తాయ్.

"""/" / ఇప్పటికే ప్రాథమికంగా ఒక అవగాహన కుదిరినప్పటికీ పూర్తిస్థాయి నిర్మాణాత్మక చర్చలు మాత్రం ఈ రెండు పార్టీల మధ్య జరగలేదు ఇప్పుడు నెల రోజులు పాటు బాబుకు పూర్తి సమయం దొరకడంతో ఇక పార్టీ నిర్మాణానికి అవసరమైన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను పూర్తి చేస్తారని జాతీయ స్థాయిలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై విధివిధానాలను ఖరారు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

బాబు అండ ఉంటే కార్యకర్తలు కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేసే వాతావరణం తెలుగుదేశంలో కనిపిస్తుంది .

ఎందుకంటే తెలుగు దేశానికి ఏ- టు -జెడ్ చంద్రబాబు మాత్రమే కాబట్టి.

దాంతో బాబు విడుదలతో తెలుగుదేశానికి సరికొత్త జోష్ వస్తుందని ఇక ఫుల్ స్పీడుతో టిడిపి పరుగులు పెడుతుందని బాబు అభిమానులు విశ్లేషణ చేస్తున్నారు.

మనకు సినిమాలు చేత కాక జక్కన్నను అంటున్నాం…ప్లాప్ సెంటిమెంట్ పై ఎన్టీఆర్ కామెంట్స్!