పేదలకు ఉచిత న్యాయ సహాయంపై అవగాహన

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజవర్గంలోని గరిడేపల్లి మండలం గడ్డిపల్లి ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో శుక్రవారం ఆజాదీ కా అమృత్యోత్సవ్ కార్యక్రమంలో భాగంగా లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహించారు.

ఈకార్యక్రమానికి హుజుర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జ్ సాంకేత్ మిశ్రా హాజరై విద్యార్థినీ,విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించారు.

విద్యార్థులకు న్యాయపరమైన,చట్టపరమైన అంశాలలో పరిజ్ఞానం అవసరమని వారు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో గరిడేపల్లి మండల ఎస్సై కొండల్ రెడ్డి,పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయవాదులు,గ్రామ సర్పంచ్ సుందరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ మేకల స్రవంతి శోభన్ బాబు,ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రవికుమార్,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్ ముగిసినా విగ్రహాలకు తొలగని ముసుగులు...!

Latest Suryapet News