అవార్డులు,సన్మానాలు పనితనాన్ని మెరుగుపరచాలి: డాక్టర్ కోట చలం,డి.ఎం.అండ్ హెచ్.ఓ

సూర్యాపేట జిల్లా:ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం మాట్లాడుతూ విశ్వం మనుగడకు మరియు ప్రజల ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని, వాయు కాలుష్యం,ఆహార కాలుష్యం మరియు నీటి కాలుష్యం వల్ల మానవాళికి అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు వైద్య అధికారులు మాట్లాడాతూ మానవాళి జీవనశైలిలో ఎదుర్కొనే వివిధ రకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.అసంక్రమిత వ్యాధులను మొదటి దశలోనే గుర్తించడం వల్ల వాటి వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు నివారించే అవకాశం ఉందన్నారు.

అనంతరం అసంక్రమిత వ్యాధుల నివారణ విభాగంలో జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అవార్డు పొందిన వైద్యాధికారులు డాక్టర్ సుధీర్ చక్రవర్తి, డాక్టర్ యాదా రమేష్,డాక్టర్ లక్ష్మీప్రసన్న,డాక్టర్ ప్రమోద్,డాక్టర్ నాగయ్య,డాక్టర్ సన,డాక్టర్ జగదీశ్వర్,డాక్టర్ మణిదీప్,డాక్టర్ దిలీప్, సూపర్వైజర్లు భూతరాజు సైదులు,చివ్వెంలకు చెందిన శిరోమణి,వరమ్మ,రామకృష్ణ,బిచ్చు నాయక్, అంజయ్య,ఆరోగ్య కార్యకర్తలు బేబీ,పద్మ,సుజాత, సునీత,రమాదేవి ఆశా కార్యకర్తలు ధనలక్ష్మి,సీతమ్మ, ఝాన్సీ,ధనమ్మ,లక్ష్మమ్మ,రమణ,పద్మలకు అవార్డులు ప్రధానం చేసి,శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హర్షవర్ధన్,జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వెంకటరమణ,జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సాహితి,ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ భూతరాజు సైదులు,భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. ఎన్ని ఎకరాలంటే?
Advertisement

Latest Suryapet News