మంచికి చేయడానికి అవధుల్లేవ్

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణ పరిధిలో గల ఖమ్మం క్రాస్ రోడ్ లో ప్రమాదకరంగా మారిన పెద్ద గుంతను ట్రాఫిక్ ఎస్ఐగా నిధులు నిర్వహిస్తున్న ఎండి.

మగ్దూం అలీ మరమ్మతులు చేయించి మంచి పని చేయడానికి ఎవరికీ అవధుల్లేవని నిరూపించారు.

ప్రజలకు ఆ గుంత వలన ప్రమాదం పొంచి ఉన్నదని తలచి తక్షణమే సిమెంట్,కాంక్రీట్ తెప్పించి, సుతారులను పిలిచి మర్మతుల చర్యలు చేపట్టి వాహనదారులకు ప్రమాదంగా ఏర్పడిన సమస్యను పరిష్కారం చేశాడు.మానవత్వం ఉంటే మార్పు తధ్యం అని తన సేవతో రుజువు చేసిన మగ్దుం అలీకి పలువురు ప్రశంశలు కురిపిస్తున్నారు.

ఇటు వంటి సంఘటనలు చూస్తూ కూడా చలించని ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్
Advertisement

Latest Suryapet News