రోజుకి 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. అయితే మీ ఆరోగ్యం పై ఈ ప్రమాదం ఉన్నట్లే..

ప్రస్తుతం మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు నిద్రలేమితో బాధపడుతున్నారు.దీనివల్ల వారు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం.మనిషికి సరిగ్గా ఏడు గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఒకటి రెండు రోజులు తక్కువ నిద్రపోయినా ఆ తర్వాత తగినంత నిద్రపోవడం ద్వారా దాన్ని భర్తీ చేసుకోవచ్చు.కానీ ప్రతిరోజు ఇలాగే చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో చాలామంది ప్రజలు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రపోతున్నారని తెలిసింది.ఇలా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఎక్కువగా 50 సంవత్సరాలు దాటిన వారు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.

Advertisement
Are You Sleeping Less Than 5 Hours A Day ,sleeping Less ,sleeping,Insomnia,Healt

పరిశోధకులు ఏం చెబుతున్నారంటే 50, 60, 70 ఏళ్ల వయసున్న ముగ్గురు వ్యక్తులను వర్గీకరించారు.ఇందులో 50 ఏళ్లు పైబడిన వారు 5 గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోతున్నారని తెలుసుకున్నారు.

సాధారణంగా నిద్రపోతున్న వారి కంటే ఐదుగురు గంటలకంటే తక్కువగా నిద్రపోయేవారు 20 శాతం అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది అని మీరు గుర్తించారు.సరైన నిద్ర లేకపోవడం వల్ల 13 రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఈ మూడు వయసుల వారిలోనూ 5 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోవడం వల్ల మల్టిమోర్బిడిటీ ప్రమాదం 30 నుండి 40 శాతం పెరిగిందని పరిశోధకులు పరిశీలించి తెలుసుకున్నారు.

Are You Sleeping Less Than 5 Hours A Day ,sleeping Less ,sleeping,insomnia,healt

సరైన నిద్ర లేకపోవడం వల్ల గుండెజబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.వీటితో పాటు ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే నిద్రలేమి వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, జ్ఞాపక శక్తి కూడా తగ్గడంతో ఏ పని మీద దృష్టి సారించలేరని చెబుతున్నారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

కాబట్టి ప్రతిరోజు సరైన ఆరు నుంచి ఏడు గంటల వరకు నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు