News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20

1.టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

టీడీపీ నేత బుద్దా వెంకన్న ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

జయహో బీసీ నేపథ్యంలో బయటకు వెళ్ళ వద్దని సూచించారు. 

2.తాడిపత్రి లో జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీ

  తాడిపత్రి మున్సిపల్ ఆపీసుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీగా బయల్దేరి వెళ్లగా , పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులు, జేసీ వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

3.తుఫాను గా బలపడనున్న వాయుగుండం

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారై కాల్ కు తూర్పు ఆగ్నేయం గా 770 కి.మి చెన్నై కి దూరంలో కేంద్రీకృతం అయ్యింది.ఈ ప్రభావం ఏపీలో అనేక జిల్లాల్లో కనిపించనుంది . 

4.పురంధరేశ్వరి కామెంట్స్

  బీసీ కార్పొరేషన్ పేరుతో కులాల మధ్యన చిచ్చు పెట్టారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధరేశ్వరి విమర్శించారు. 

5.ఉద్రిక్తంగా మారిన సీపీఐ చలో రాజ్ భవన్

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఖైరతాబాద్ చౌరస్తలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.పోలీసులకు, సీపీఐ నేతలకు మధ్య తోపులాట జరిగింది. 

6.మల్లిఖార్జున ఖర్గే ను కలుస్తా : జగ్గారెడ్డి

  కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున కర్గేను కలుస్తానని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 

7.జగిత్యాల నుంచి టీఆర్ఎస్ జైత్ర యాత్ర

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలవుతుంది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 

8.ఇండియన్ రేసింగ్ లీగ్

  హైదరాబాద్ నగరంలో మరోసారి కార్ రేసింగ్ ఈ నెల 9 న ఉదయం 11 గంటల నుంచి 11 సాయంత్రం వరకు ఎన్టీఆర్ మార్గ్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది. 

9.సింగరేణి ని ప్రవేటు పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారు

 

సింగరేణి ని ప్రవేటు పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారు అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. 

10.సిట్ నివేదిక లీక్ పై హైకోర్టులో వాదనలు

  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దాఖలు చేసిన కౌంటర్ లీక్ కావడం పై తెలంగాణ హై కోర్టు లో వాదనలు జరిగాయి. 

11.ఎన్నారై మెడికల్ కాలేజ్ వ్యవహారం పై ఈడి ప్రకటన

 

ఎన్నారై మెడికల్ కాలేజ్ సోదాలకు సంబందించి ఈడి ప్రకటన చేసింది.ఈ సోదాల్లో మొత్తం 53 చోట్ల స్థిరాస్తుల ను ఈడి గుర్తించింది. 

12.బండి సంజయ్ కామెంట్స్

  దేశమంతా కేసీఆర్ కుటుంబాన్ని చూసి అసహ్యించుకుంటుందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

13.రేవంత్ రెడ్డి కామెంట్స్

 

గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్ఏలు పట్టుకొమ్మలని, వారితో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. 

14.నోట్ల రద్దు పై సుప్రీం లో ముగిసిన విచారణ

  నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు సుప్రీం కోర్టు లో విచారణ ముగిసింది.తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. 

15.వైసిపి పాలనలో బీసీలకు అన్యాయం

 

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

వైసీపీ కాలంలో బీసీలకు అన్యాయం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నిరసనలు చేపట్టి, అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతిపత్రం సమర్పించారు. 

16.దేవినేని అవినాష్ నివాసంలో ముగిసిన సోదాలు

  వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్ నివాసంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

17.తిరుమల సమాచారం

 

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు ఒక్క కంపార్ట్మెంట్ లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. 

18.ఎమ్మెల్యే రాజా సింగ్ కు నోటీసులు

  బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ కు ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేశారు. 

19.ఐ ఎం ఐ తెలంగాణ కు ఐదుగురు సలహాదారులు

 

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగానికి సలహా దారులుగా ఐదుగురు ప్రముఖులను నియమించినట్లు ఐ ఎం ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీ ఎన్ రావు తెలిపారు. 

20.పుస్తక ప్రదర్శన అనుమతి కోసం

  ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు తెలంగాణ కళాభారతి స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన పుస్తక ప్రదర్శన కు అనుమతి కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరశంకర్ కలిసి  వినతి పత్రం అందజేశారు.

తాజా వార్తలు