సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కంటే ముందే మహేష్ సర్కారు వారి పాట సినిమాతో ఘన విజయం అందుకున్నాడు.
ఇది రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్న మొన్నటి దాకా త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది.
ఎట్టకేలకు అంత సెట్ అయ్యి షూట్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసారు.కొద్దిగా గ్యాప్ ఇచ్చి సెకండ్ షెడ్యూల్ చేయాలని అనుకున్న త్రివిక్రమ్ కు మహేష్ కారణంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సెకండ్ షెడ్యూల్ కోసం కూడా రెడీ అవుతున్న సమయంలో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించింది.దీంతో కొద్దిరోజులు మహేష్ ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చాడు.
ఇక మహేష్ కొద్దిగా సెట్ అయ్యాడు అని మళ్ళీ సెట్స్ మీదకు వెళుతుంది అనే టైం లో మళ్ళీ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మరో సారి బ్రేక్ వచ్చింది.ఇప్పుడిప్పుడే మహేష్ ఈ సంఘటనల నుండి బయట పడుతూ కుటుంబంతో కాస్త హ్యాపీ గా స్పెండ్ చేస్తున్నాడు.
తండ్రి ఇచ్చిన మనో ధైర్యంతో ముందు రోజుల్లో మరింత బలంగా నిలబడతాను అని మహేష్ కూడా ప్రామిస్ చేసాడు.
ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు అందరితో కలుస్తూ కొద్దిగా ఆ బాధల నుండి బయట పడాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది.
ఈ క్రమంలోనే మహేష్ బాబు ఫ్యామిలీతో SSMB28 టీమ్ కలిసి డిన్నర్ చేయడం ఆసక్తిగా మారిపోయింది.దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.అయితే వీటిలో మహేష్, త్రివిక్రమ్, థమన్ కలిసి డిన్నర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది అని ఎప్పుడో ఫిక్స్ చేసారు.అలాగే హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.