ఇమాంపేట గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని శనివారం ఇంటివద్ద ఆత్మహత్య చేసుకోవడంతో వరుస ఘటనలతో విద్యార్దినిల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇటీవలనే అదే గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బైపిసి చదువుతున్న విద్యార్థిని డి.

వైష్ణవి కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగిన సాయంత్రమే ఉరివేసుకొని మరణించిన విషయం తెలిసిందే.ఈ విషయమై మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు రాస్తారోకోలు,ధర్నాలు చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వ అధికారులు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ ను శుక్రవారం సస్పెండ్ చేశారు.

Another Student In Imampet Gurukul School Died, Student ,imampet Gurukul School

ఆ సంఘటన మరువక ముందే తాజాగా అదే గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సూర్యాపేట జిల్లా మోతె మండలం బురకచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్, జ్యోతిల కుమార్తె ఇరుగు అస్మిత(15) శనివారం ఉరివేసుకొని మరణించడం సంచలనం సృష్టిస్తుంది.ఈ నెల 10న ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మృతి కారణంగా విద్యార్దినిలు భయపడకుండా ఉంటానికి గురుకులానికి నాలుగు రోజులు (హోం సిక్ ) సెలవులు ప్రకటించారు.

దీంతో అస్మిత సెలవులలో హైదరాబాద్ లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది.శనివారంతో సెలవులు ముగియడంతో పాఠశాలకు వెళ్దామని చెప్పి తన పనులకు వెళ్లిన అస్మిత తల్లి తిరిగి వచ్చేసరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్ కు సున్నితో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించింది.

Advertisement

పాఠశాలకు వెళ్లాల్సిన రోజే అస్మిత ఉరివేసుకోవడం మిస్టరీగా మారింది.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ
Advertisement

Latest Suryapet News