రాములో రాములా అంటూ స్టెప్స్ వేసిన సుమక్క!

మాతృ భాష మళయాళం అయినా అనర్గళంగా తెలుగులో మాట్లాడుతూ తన యాంకరింగ్ తో మెస్మరైజ్ చేస్తూ బుల్లి తెర లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ సుమ.

ప్రస్తుతం లాక్ డౌన్ తో ఖాళీ గా ఉంటూ అప్పుడప్పుడూ వీడియోలు,సుమక్క షో లు చేసుకుంటూ బిజీ బిజీ గా ఉంటున్న సుమ తాజాగా బన్నీ హిట్ సాంగ్ కు తనదైన శైలి లో డ్యాన్స్ చేసింది.

ఎప్పుడూ టీవీ షోలు, ఆడియో, ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ల‌తో బిజీగా ఉండే ఈ స్టార్ కు.తాజా లాక్ డౌన్ తో ఊహించ‌నంత టైమ్ స్పైస్ దొరికింది.ఇక సోష‌ల్ మీడియాలో కూడా సుమ చాలా యాక్టీవ్ గా ఉంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్ డేట్స్ నెటిజ‌న్ల‌తో పంచుకుంటూ ఉంటుంది.త‌నకు తెలిసిన హెల్త్ టిప్స్ తో వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

లాక్‌డౌన్ సమయంలో కూడా తోటి యాంకర్స్ అందరితో కలిసి ఎంట‌ర్టైన్మెంట్ ప్రొగ్రామ్ చేస్తోంది సుమ‌.ఇక ఇప్పుడు ఏకంగా డ్యాన్సులు మొద‌లెట్టేసింది.

Advertisement
Anchor Suma Performs Superb Dance To Allu Arjun’s Ramuloo Ramulaa Song, Anchor

అల్లు అర్జున్ ‘అల వైకుంఠ‌పురములో’ సినిమాలోని రాములో రాములా పాట‌కు అదిరిపోయే స్టెప్పులు వేసింది సుమక్క.దానికి సంబందించిన వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

అయితే ఆ వీడియోలో సుమ తో పాటు ఆమె పెట్ డాగ్ కూడా ఉంది.ఇక బన్నీ,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘రాములో రాములా’ సాంగ్ ఎంత ఫేమ‌స్ అయ్యిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

Anchor Suma Performs Superb Dance To Allu Arjun’s Ramuloo Ramulaa Song, Anchor

ప‌లువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు విదేశీయులను సైతం ఈ పాట అలరించింది.ముఖ్యంగా టిక్ టాక్ లో ఈ పాటకు ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో పాటు కలిసి స్టెప్స్ వేశాడు.అయితే ఇప్పుడు సుమక్క‌ కూడా బన్నీ పాటకు డాన్స్ చేయగా,ఇది కాస్తా నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు