మళ్లీ రెమ్యునరేషన్ ను పెంచిన సుమ.. నిర్మాతలు ఆ రేంజ్ లో ఇవ్వడం సాధ్యమేనా? Anchors

సాధారణంగా స్టార్ యాంకర్( Star Anchore ) గా గుర్తింపును సొంతం చేసుకున్న యాంకర్లు సైతం పదేళ్ల కంటే ఎక్కువగా కెరీర్ ను కొనసాగించలేరనే సంగతి తెలిసిందే.అయితే సుమ మాత్రం రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.అవాక్కయ్యారా ప్రోగ్రామ్ తో ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసిన సుమ అప్పటినుంచి ఇప్పటివరకు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.టీవీ ప్రోగ్రామ్( TV Programs ) కు గతంలో 2 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న సుమ ప్రస్తుతం గరిష్టంగా 3 లక్షల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని సమాచారం.ఈవెంట్లకు అయితే ఏకంగా 5 లక్షల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారని తెలుస్తోంది.సుమ రెమ్యునరేషన్ భారీగా పెరగడంతో నిర్మాతలు ఆమెకు ఈ రేంజ్ లో ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు యాంకర్ సుమకు( Anchore Suma ) ఈ తరం యూత్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.వయస్సు పెరుగుతున్నా మేకప్ తో సుమ తన వయస్సు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.సుమ వేసే పంచ్ లు మామూలుగా ఉండవనే సంగతి తెలిసిందే.సుమ వేసే పంచ్ లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.క్యాస్టూమ్స్ విషయంలో కూడా సుమ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సుమ ఆస్తుల విలువ భారీగా ఉందని టీవీ షోల ద్వారా ఆమె ఊహించని స్థాయిలో సంపాదించారని బోగట్టా.గతంతో పోల్చి చూస్తే లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం సుమ డిమాండ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ సుమ అభిమానులకు దగ్గరవుతున్నారు.యాంకర్ సుమను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.

సుమ బుల్లితెరపై మరింత సక్సెస్ సాధించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube