Anasuya : అరేయ్ చిట్టిబాబు అంటూ రామ్ చరణ్ కు స్పెషల్ విషెస్ చెప్పిన రంగమ్మత్త?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.

 Anasuya Wish To Ramcharan In Rangammattha Style-TeluguStop.com

ఇక రామ్ చరణ్ సినీ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో రంగస్థలం ( Rangasthalam ) సినిమా ఒకటి సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఈ సినిమాలో చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించారు.ఇక ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ ( Anasuya ) కూడా ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ పాత్ర తన కెరీయర్ ను పూర్తిగా మార్చేసిందని చెప్పాలి.

రంగస్థలం సినిమా తర్వాత అనసూయ నటనకు ప్రేక్షకులు అందరూ ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో బుల్లితెరకు కూడా దూరమయ్యారు.రంగమ్మత్త పాత్రలో అనసూయ వేషధారణ మాట తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

ఇకపోతే అనసూయ నటించినటువంటి రజాకర్ సినిమా( Razakar ) త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయకు ఒక చిన్న ప్రశ్న ఎదురయింది.మీరు రంగం అత్త పాత్రలో మాట్లాడిన విధంగానే రామ్ చరణ్ కు క్లిన్ కారా( Klin kara ) పుట్టిన సందర్భంగా తనకు రంగం మొత్తం స్టైల్ లో విషెస్ చెప్పాలంటే ఎలా చెబుతారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ.

అరేయ్ చిట్టిబాబు( Chittibabu ) పాప పుట్టింది అంటగా.చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు.

జాగ్రత్తగా ఉండండే అంటూ రంగమ్మత్త( Rangamatha ) స్టైల్ లో చెప్పడంతో మరోసారి అనసూయ చిట్టిబాబు రంగమ్మత్తను గుర్తు చేసింది అంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube