Anasuya : అరేయ్ చిట్టిబాబు అంటూ రామ్ చరణ్ కు స్పెషల్ విషెస్ చెప్పిన రంగమ్మత్త?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) ఒకరు.

ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక రామ్ చరణ్ సినీ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో రంగస్థలం ( Rangasthalam ) సినిమా ఒకటి సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఈ సినిమాలో చిట్టి బాబు పాత్రలో రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించారు.

ఇక ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ ( Anasuya ) కూడా ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ పాత్ర తన కెరీయర్ ను పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. """/"/ రంగస్థలం సినిమా తర్వాత అనసూయ నటనకు ప్రేక్షకులు అందరూ ఫిదా అయ్యారు.

ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నటువంటి తరుణంలో బుల్లితెరకు కూడా దూరమయ్యారు.

రంగమ్మత్త పాత్రలో అనసూయ వేషధారణ మాట తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.ఇకపోతే అనసూయ నటించినటువంటి రజాకర్ సినిమా( Razakar ) త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

"""/"/ ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయకు ఒక చిన్న ప్రశ్న ఎదురయింది.

మీరు రంగం అత్త పాత్రలో మాట్లాడిన విధంగానే రామ్ చరణ్ కు క్లిన్ కారా( Klin Kara ) పుట్టిన సందర్భంగా తనకు రంగం మొత్తం స్టైల్ లో విషెస్ చెప్పాలంటే ఎలా చెబుతారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ.అరేయ్ చిట్టిబాబు( Chittibabu ) పాప పుట్టింది అంటగా.

చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు.జాగ్రత్తగా ఉండండే అంటూ రంగమ్మత్త( Rangamatha ) స్టైల్ లో చెప్పడంతో మరోసారి అనసూయ చిట్టిబాబు రంగమ్మత్తను గుర్తు చేసింది అంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

హర్రర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిన వరుణ్ తేజ్