సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులలో అల్లు శిరీష్( Allu Sirish ) ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి.
కారణం ఏంటి అంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఆయన తాలూకు ఇంటెన్స్ అనేది చాలా వరకు మిస్ అవుతుంది అని చాలా మంది అంటున్నారు.నిజానికి ఈయన అల్లు అరవింద్ ( Allu Arvind )గారి కొడుకు అయినప్పటికీ ఇండస్ట్రీ లో ఒక సూపర్ సక్సెస్ సినిమా తీయడానికి చాలా వరకు ఇబ్బంది పడుతున్నాడు.అందుకే ఆయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా బోల్తా కొడుతున్నాయి…
నిజానికి ఈయన చేసిన సినిమాల్లో శ్రీరస్తు శుభమస్తు సినిమా( Srirastu Subhamast ) ఒక్కటే సూపర్ సక్సెస్ అయింది.మిగిలిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగిలాయి అనే చెప్పాలి.అందుకే ఇక ఆయన తీయబోయే సినిమా మీద చాలా కేర్ తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది.నిజానికి ఈయన తలుచుకుంటే ఇండస్ట్రీ లో ఉన్న సక్సెస్ ఫుల్ మీడియం రేంజ్ డైరక్టర్ల తో సినిమా చేసే కెపాసిటీ ఆయనకి ఉంది.
కానీ తను సోలో గా ఇండస్ట్రీ లో ఎదగాలి అని చూస్తున్నట్టు గా తెలుస్తుంది….
అయితే రాబోయే సినిమాలు కూడా వాళ్ల నాన్న సహకారం తో చాలా జాగ్రత్త గా సెలెక్ట్ చేసుకొని మరీ సినిమా చేస్తున్నారు.ఇక అందులో భాగం గానే ఒక యంగ్ డైరెక్టర్ తో ఒక థ్రిల్లర్ సినిమా ఒకటి చేయాలని చూస్తున్నాడు.ఆ డైరెక్టర్ చెప్పిన కథ ఆయనకి బాగా నచ్చడం తో ఆ సినిమాని చేసే పనిలో బిజీ గా ఉన్నాడు…ఈ సినిమాతో కనక సక్సెస్ కొడితే శిరీష్ కి వరుసగా మంచి డైరెక్టర్ల నుంచి అవకాశాలు వస్తాయి అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు…
.