హైద్రాబాద్ సభలో అన్ని అబద్దాలే

సూర్యాపేట జిల్లా:హైదరాబాద్ లో ఆదివారం జరిగిన బీజేపీ ప్రజా సంకల్పసభలో మోడీ అన్ని అబద్దాలు మాట్లాడారని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు వచ్చి మోడీ రాష్ట్రానికి ఉపయోగపడే ఏ అంశం చెప్పలేదని, కేవలం తెలంగాణపై ఉన్న ఈర్ష్యా ద్వేషాలను వెళ్లగక్కారని,కేసీఆర్ వేసిన ప్రశ్నలకు మోడీ సమాధానం చెప్పలేక భయపడ్డాడని అన్నారు.

రాష్ట్రం నుండి లక్షల్లో తీసుకుని కేంద్రం నుండి వందల్లో ఇస్తున్నరు కాబట్టే మోడీ తడబాటుకు గురైయ్యారని తెలిపారు.మోడీ చెప్పిన అభివృద్ధి ఆనవాళ్లు ఎక్కడా కనపడటంలేదని,హైద్రాబాద్ సభలో అన్ని అబద్దాలు మాట్లాడారని,ప్రధానమంత్రి హోదాలో స్థాయికి తగట్టుగా రాష్ట్రానికి వరాలు ప్రకటించలేదని విమర్శించారు.

All Liars In Hyderabad Sabha-హైద్రాబాద్ సభలో అన�

తెలంగాణ పేరెత్తినప్పుడల్లా విషం కక్కిన మోడీ ఇప్పుడు ప్రేమ ఓలకబోస్తున్నాడని, అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణాకు తక్కువ నిధులు ఇచ్చారని గుర్తు చేశారు.టెక్స్టైల్ పార్క్ ఎప్పుడో రావలసి ఉందని,ఇప్పటికీ వచ్చేంతవరకు నమ్మలేమని,డబుల్ ఇంజన్ అభివృద్ధి అంతా డొల్లేనని,బీజేపీ పాలిత రాష్ట్రాలు వెనుకబాటులో మగ్గుతున్నాయని చెప్పారు.

తెలంగాణాలో బీజేపీ డబుల్ ఇంజన్ వస్తే ప్రజలకు మద్దెల దరువేనని, ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని,కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేందుకే మోడీ తాపత్రయంపడుతున్నారని ఆరోపించారు.బీజేపీ గుళ్ళు,గోపురాలు కట్టి రాజకీయంగా వాడుకుంటూ, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం తప్పా అభివృద్ధిపై బీజేపీకి పట్టింపులేదన్నారు.

Advertisement

దేశ ప్రజలు నూతన అజెండా కోసం ఎదురుచూస్తున్నారని కేసీఆర్ అన్నందుకే హైద్రాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమేవేశాలు,సభలు ఏర్పాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణా అభివృద్ధి చూసి నేర్చుకునే బదులు విషం కక్కుతున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

డబుల్ ఇంజన్ గ్రోత్ అనేది మెడిపండు భ్రమే తప్ప,విఠాలాచార్యకు మించిన వాట్స్ అప్ యూనివర్సిటీల మహిమ తప్ప అందులో ఏమి లేదని స్పష్టం చేశారు.కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకుండా నేటికీ తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 5 ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తుందట ఇంతకంటే పెద్ద హాస్యాస్పదం లేదని అన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన నూతన అజెండా అంశం చర్చనీయాంశంగా మారుతుందని,నూతన అజెండా అంశాలు సాధించుకునేందుకు కావలసిన మార్గాన్ని కేసీఆర్ నాయకత్వంలో నిర్మాణం చేసుకోబోతున్నారని ప్రకటించారు.అలాగే కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా కూడా ప్రజలు గుర్తించడం లేదని,వారిలో వారే ఎండ్రకిచ్చల్లాగా కోట్టుకుంటుంటే ప్రత్యామ్నాయం ఎలా అవుతారని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోసం బిజెపి,కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని తేల్చిచెప్పారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దేశ్ ముఖ్ రాధిక
Advertisement

Latest Suryapet News